Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండెక్కిన కోడి.!

కొండెక్కిన కోడి.!

- Advertisement -

వారం రోజుల్లోనే రూ.100 పెంపు
ఎండలకు చనిపోతున్న కోళ్లు
పెళ్లిళ్ల సీజన్తో ధరల భారం
నవతెలంగాణ – మల్హర్ రావు

కోడి ధర కొండెక్కింది. ఈ నెల 1న కిలో రూ.260గా ఉన్న ధర బుధవారం రూ.360కి పెరిగింది.పది రోజుల్లోనే కిలోపై రూ.100 పెరగడం గమనార్హం.అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోంది. వేసవి కావడంతో ఎండలకు కోళ్లు చనిపోతున్నాయని, వాటి బరువు కూడా తగ్గిపో వడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.ఈ ధరలను చూసి కొనుగోలు దారులు బెంబేలెత్తుతున్నారు. ఈ ధరలు మరో 15 నుంచి 20 రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

తగ్గిన ఉత్పత్తి
ఎండలకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.దీంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. అధికంగా కంపెనీల యజమానులే షెడ్లలో కోళ్లను పెంచి, వారు నిర్ణయించిన ధరకే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమని చెప్పొచ్చు. స్కిన్లెస్ కిలో రూ.380కి,లైవ్ కోడి రూ.210, స్కిన్తో రూ.360కి అమ్ముతున్నారు.

చికెన్ కిలో ధర రూ.360 : అనిప్.. వినియోగదారుడు
పెళ్లిళ్ల సీజన్ తో డిమాండ్ పెళ్లిళ్ల సీజన్ తో చికెనక్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ఎండ త్రీవత కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. డిమాండ్ మేర ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల నుంచి కోళ్ల, చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.360కి విక్రయిస్తున్నాం. ధరలు పెరగడంతో కొంతమేరకు విక్రయాలు తగ్గాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -