– 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం
– నాటి బీఆర్‌ఎస్ పాలనలో గ్రూప్ పరీక్షల పేపర్లు లీక్
– మూల్యాంకనంలో లోపాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థుల ఆత్మహత్య
– సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..! : ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
డబుల్ ఇంజన్ సర్కార్‌గా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నీట్ పరీక్ష పేపర్ల లీకేజీయే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రలో పరీక్షకు 48 గంటల ముందు పేపర్లను లీక్ చేశారని, దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నీట్ పేపర్ల లీకేజీ ఏ విధంగా జరిగిందో నాటి బీఆర్‌ఎస్ హయాంలోనూ గ్రూప్- 1 మొదలు గ్రూప్-4 వరకు ఎగ్జామ్ పేపర్ల లీకేజీ, పరీక్షలు రద్దు కావటం చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రూప్స్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు క్లస్టర్‌లో బుధవారం నిర్వహించిన ‘ప్రజాదర్భార్’ సభలో మంత్రి మాట్లాడారు.
నీట్ పరీక్ష పేపర్ల లీకేజీపై మంత్రి ఆగ్రహం
నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షకు 42 గంటల ముందే పేపర్లు బయటకు రావడం దారుణ మన్నారు. దేశ వ్యాప్తం గా 23 లక్షల మంది మన రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థులు ఈ పరి ణామంతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో వాలని, నష్టపోయిన విద్యార్థు లను ఆర్థికంగా ఆదుకో వాలని డిమాండ్ చేశారు.
జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తొలి విడత నాలుగున్నర లక్షల ఇండ్లు పంపిణీ చేశామన్నారు. మూడు, నాలుగో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సైతం ఉంటుందన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రజా దర్బార్ సభల్లో అత్యధికం గా ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పింఛన్లు, సాదా బైనామా దర ఖాస్తుల పరిష్కారం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, గ్యాస్ సబ్సిడీ కోసం అత్యధికం గా దరఖాస్తులు వస్తున్నట్టు వివరిం చారు. జీళ్ళచెరువు క్లస్టర్ పరిధి లోని 13గ్రామ పంచాయతీ ల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి మంత్రి పొంగులేటి జిల్లా కలెక్ట ర్, జిల్లా ఉన్న తాధికా రులతో కలిసి రాత్రి 10 గంటల వరకూ దరఖాస్తు లు స్వీకరించారు. న్యాయమైన ప్రతి సమస్యనూ 100 శాతం పరిష్కరిస్తా మని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు 10 క్లస్టర్లలో నిర్వహించిన ప్రజా దర్బార్ సభల్లో రెండు వేల దరఖా స్తులకు పైగా వచ్చాయని కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలోనూ..
తెలంగాణలో గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలోనూ గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు అన్ని పేపర్లూ లీక్ అయ్యాయని మంత్రి అన్నారు. ఆనాటి మంత్రుల పీఏలే జిరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్మారని తెలిపారు. ఆనాడు ఇంటర్ ఫలితాల తారుమారు వల్ల 28 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే నియామక సంస్థలను ప్రక్షాళన చేసి, పారదర్శకంగా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.



