రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలాంటి సంపన్నులకే సంపదను దోచిపెడుతున్నదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిదారులకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని చెప్పారు. వారి బాగోగులు పట్టించుకోవడం లేదని అన్నారు. గీత కార్మికులకు మొండిచేయి చూపుతున్నదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గీత కార్మికులకు అనేక వాగ్దానాలు చేసిందనీ, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఇవ్వాల్సిన రూ.20 కోట్లు 30 నెలల కాలం గడిచినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెన్షన్ రూ.నాలుగు వేలకు పెంపు, ఎక్స్‌గ్రేషియా రూ.పది లక్షలకు పెంచుతామని
చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలి పోయాయి అన్నారు. వృత్తిలో ఆధునీకరణకు చర్యలు తీసుకుని గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, నాయకులు వి వెంకట నరసయ్య, బొలగాని జయరాములు, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, గౌని సాంబయ్య, చౌగని సీత రాములు, ఎస్ రమేష్ గౌడ్, బుర్ర శ్రీనివాస్, మడ్డి అంజి బాబు, రాగిరు కృష్ణయ్య, గుండెబోయిన రవి గౌడ్, మెరుగు వీరస్వామి, పి అచ్చులు తదితరులు పాల్గొన్నారు.
సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



