Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓయూ మాజీ రిజిస్ట్రార్ 
ప్రొ. లక్ష్మీనారాయణ కన్నుమూత

ఓయూ మాజీ రిజిస్ట్రార్ 
ప్రొ. లక్ష్మీనారాయణ కన్నుమూత

- Advertisement -

నివాలుళర్పించిన ప్రజాప్రతినిధులు, వీసీలు, మాజీ వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ

ఓయూ మాజీ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం మాజీ డీన్ (ఇంజినీరింగ్) ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ (60) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతిచెందారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో ఓయూ విద్యా, పరిపాలనా రంగాలు ఒక నిష్ణాత విద్యావేత్తను కోల్పోయాయి. హైదరాబాద్‌ ఉప్పల్ బాగాయత్‌లోని లేఅవుట్-305 ఈస్ట్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయన నివాసానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు డా. దాసోజు శ్రవణ్, ప్రొ. కోదండరామ్‌, విశ్వవిద్యాలయ మాజీ, ప్రస్తుత వీసీలు ప్రొ. గంటా చక్రపాణి, ప్రొ. కుమార్, ప్రొ. టి.తిరుపతి రావు, ప్రొ.రాంచంద్రం, ప్రొ.సాయన్న, ప్రొ.సురేష్ కుమార్, ప్రొ. మల్లేష్, ప్రొ.లింబాద్రి, ప్రొ. శ్రీరాం వెంకటేష్, ప్రొ. గోపాల్ రెడ్డి, డా.చారుకొండ వెంకటేష్, డా.పరశురాం, ప్రొ. మంగు, కృష్ణారావు, ప్రొ. కాశిం, ప్రొ. చంద్రశేఖర్ తదితరులు వెళ్లి లక్ష్మీనా రాయణ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఓయూ బోధనేతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఖదీర్ ఖాన్, వెంకటేష్, నాగరాజారావు, అక్బర్ బేగ్, పవన్, భిక్షపతి, రాజేష్, రాజేశ్వర్, జర్నలిస్టులు ఆఖిలేష్, రుద్రశంకర్, ఆర్. వెంకట్, జంగన్న, తలారి శ్రీనివాసరావు తదితరులు నివాళు లర్పించారు. నాగోల్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగు లు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొని అశ్రునయ నాలతో వీడ్కోలు పలికారు.
సేవా కార్యక్రమాల్లో…
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన ప్రొ. లక్ష్మీనారాయణ పాఠశాల, కళాశాల విద్యను లింగాల గణపురం, జనగామలో పూర్తి చేసి ఓయూ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. 1990-91లో వరంగల్ జిల్లా పరిశ్రమల కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన, అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చారు. 1995లో ఓయూలో ఎం.టెక్, 2003లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు బోధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో విశిష్ట సేవలందించారు. లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారం భించిన ఆయన అసోసియేట్ ప్రొఫెసర్‌గా, అనంతరం ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొందా రు. మెకానికల్ ఇంజి నీరింగ్ విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్‌, డీన్ (ఇంజినీరింగ్), స్టూడెంట్స్ డీన్, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో పలు పరిపాలనా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఓయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టి, సమర్థవంతమైన పరిపాలనతో పాటు అనేక సంస్కరణలు అమలు చేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ పే బ్యాక్ సొసైటీ సిద్ధాంతాలను ఆచరణలో అమలు చేసిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వగ్రామంలో స్థలం కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాలకు అందించడం, పేద విద్యార్థుల అడ్మిషన్ ఫీజులు, విద్యా అవసరాలకు ఆర్థిక సహాయం చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూత అందించడం వంటి సేవలు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఆయన విశేష పాత్ర పోషించారు. విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, మానవతావాదిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు అధ్యాపకులు, సహచరులు కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -