- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ: విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని బాల్కొండ గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు, గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వరలక్ష్మి, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



