Friday, May 15, 2026
E-PAPER
Homeజిల్లాలుఅసంపూర్తిగా వదిలేసిన రోడ్డును తక్షణమే పూర్తి చేయాలి…

అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును తక్షణమే పూర్తి చేయాలి…

- Advertisement -
  • డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి ..

నవతెలంగాణ-మునుగోడు: కల్వకుంట్ల నుండి వెల్మకన్నె వరకు గత రెండు సంవత్సరాల క్రితం మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారని రోడ్డు పనులు తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ గతంలో ఉపఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి హామీ ప్రకారంగా శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరకోర నిధులు కేటాయిస్తూ రోడ్డు నిర్మాణాము పూర్తికాకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓట్ల కోసము అడపా దడప పనులను చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ యొక్క రోడ్డు గురించి మాట్లాడకపోవడం, ఎమ్మెల్యే గారి పైన ఒత్తిడి తీసుకురాకపోవడం గ్రామ ప్రజలను విస్మరించడమే అని అన్నారు. ఈ ఒక రోడ్డు పూర్తి కావడం వల్ల గ్రామానికి బస్సు సౌకర్యం వచ్చే అవకాశం ఉందని అంతేకాకుండా పక్క మండలమైన గట్టుప్పల్ వెళ్లడానికి మార్గం సుముకం అవుతుందని తద్వారా వాణిజ్యపరమైన సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. రేపు జరిగే ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలలో ప్రజల వద్దకు వచ్చి ఏ ముఖం తోటి ఓట్లు అడుగుతారు అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే కల్వకుంట్ల నుంచి వెల్మకన్నె రోడ్డుకు నిధులను కేటాయించి రోడ్డు పూర్తయ్యే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలను ఏకం చేసి ఎమ్మెల్యే క్యాంపుఆఫీస్ ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కట్ట ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు కట్ట వెంకన్న, పిఎన్ఎమ్ నాయకులు పగిళ్ల యాదయ్య, గ్రామ నాయకులు అశోక్, కుక్కల కార్తీక్, ఇరుగుదెండ్ల గణేష్, సాయి తేజ, రామ్ చరణ్, గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -