Saturday, May 16, 2026
E-PAPER
Homeసినిమామరో శక్తివంతమైన కథ..

మరో శక్తివంతమైన కథ..

- Advertisement -

‘హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’. ఈ సినిమాలోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ఇది. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరా బాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. రోహిత్ సరాఫ్ చేరికతో ఈ చిత్రానికి మరింత అప్పీల్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ ‘మహాకాళి’ పాన్ ఇండియా రీచ్‌ను మరింత బలోపేతం చేయనుంది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ‘హను-మాన్’ విజయానంతరం భారతీయ మూలాలతో కూడిన సినిమా యూనివర్స్ ని విస్తరించాలనే ప్రశాంత్ వర్మ విజన్‌లో భాగంగా ‘మహాకాళి’ రూపొందుతోంది. ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్‌లు ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తు న్నారు. ‘’మహాకాళి’ అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌. ‘హను-మాన్తరువాత మరో శక్తివంతమైన కథతో ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు అని మేకర్స్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -