Saturday, May 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలకు అధునాతన వైద్యమందించడమే కేసీఆర్‌ లక్ష్యం

పేదలకు అధునాతన వైద్యమందించడమే కేసీఆర్‌ లక్ష్యం

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌/అమీర్‌పేట్‌

పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అధునాతన వైద్యం అందించాలనే సంకల్పంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదురుగా నిర్మాణం పూర్తి చేసుకున్న వెయ్యి పడకల టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. చెస్ట్‌ ఆస్పత్రి పరిధిలోని 53 ఎకరాల స్థలంలో ఆధునాతన వైద్య సదుపా యాలతో ఆస్పత్రి నిర్మాణానికి కేసీఆర్‌ పునాదులు వేసారని గుర్తు చేశారు. ప్రస్తుతం 22 ఎకరాల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. రూ. 1200 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో వెయ్యి పడకలు, మూడు బ్లాకులు, 300 ఐసీయూ బెడ్లు, రోగుల సహాయకుల కోసం 200 పడకల ధర్మశాల ఏర్పాటు చేసినట్టు వివరించారు. అదనంగా 16 ఆప రేషన్‌ థియేటర్లు, ఎంఆర్‌ఐ యంత్రాలు, రేడియా లజీ, క్యాథ్‌ల్యాబ్‌ బ్లాకులు ఏర్పాటు చేశారని తెలి పారు. డబ్బులు చెల్లించి వైద్యం పొందే వారి కోసం 30 ప్రత్యేక సూట్స్‌ నిర్మించారని, వెయ్యి కార్లు నిలిపే పార్కింగ్‌ సదుపాయం కూడా కల్పించినట్టు చెప్పారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశం తోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తి చేయడం లో నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా పనులు పూర్తవడం సంతోషకరమన్నారు. ఆస్పత్రిలో ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారని, వాటిని కూడా త్వరగా పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ప్రతి జిల్లాలోనూ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని, హైదరాబాద్‌లో ఇలాంటి నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. వారి వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -