Saturday, May 16, 2026
E-PAPER
Homeక్రైమ్నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

– రెండు ఏసీ బోగీల్లో మంటలు
– ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెనుప్రమాదం
నవతెలంగాణ-మెహిదీపట్నం

హైదరాబాద్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో ప్లాట్‌ ఫారంపై ఉన్న జైపూర్‌ వెళ్తున్న ప్రత్యేక రైలు ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. రైలు బయలుదేరడానికి ముందు ప్లాట్‌ఫామ్‌పై ఆగివుండగా, దాని బీ1 బీ2 ఏసీ బోగీల్లో అకస్మాత్తు గా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బోగీలలో ప్రయాణికులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దెబ్బతిన్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంపై సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజరు కుమార్‌ శ్రీవాత్సవ్‌ స్పందించారు. హైదరాబాద్‌ నుంచి జైపూర్‌కు వెళ్లే రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన 10 నిమిషాల్లోనే బీ-1 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగి బీ-2 కోచ్‌కు వ్యాపిం చాయని చెప్పారు. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బం దికి సమాచారం అందించగా.. వారు వచ్చి మంటలు ఇతర బోగీలకు వ్యా పించకుండా బీ-1, బీ-2 కోచ్‌లను రైలు నుంచి వేరు చేసినట్టు వెల్లడిం చారు. ఈ ప్రమాదంలో బీ-1 బోగీ పూర్తిగా దగ్ధమవ్వగా, బీ-2 బోగీ పాక్షి కంగా కాలిపోయిందన్నారు. ప్రమాదసమయంలో ఆ బోగీల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -