Saturday, May 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ

మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ

- Advertisement -

– ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వాలు
– పోక్సో కేసు నమోదైనా బండి భగీరథ్‌పై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటి?
– సమరశీల పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగారెడ్డి
– యాచారంలో సీఐటీయూ నాయకులు పెండ్యాల బ్రహ్మయ్య సంస్మరణ సభ
– స్థూపం ఆవిష్కరణ
నవతెలంగాణ- యాచారం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషి స్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ప్రజా సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదివేశాయని విమర్శిం చారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని డీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో శుక్రవారం సీఐటీయూ నాయకులు కామ్రేడ్‌ పెండ్యాల బ్రహ్మయ్య సంస్మరణ సభ జరిగింది. ముందుగా బ్రహ్మన్న స్థూపాన్ని పార్టీ శ్రేణులతో కలిసి జాన్‌వెస్లీ ఆవిష్కరించి నివాళులర్పించారు. బ్రహ్మయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రజెండా ఎల్లప్పు డూ వారికి అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం సభలో జాన్‌వెస్లీ ప్రసంగించారు. ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యం పెరిగిపోయిందని, దీంతో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. బాలికపై లైంగికదాడి విషయంలో పోక్సో కేసు నమోదైనా కేంద్ర మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథ్‌పై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమే మిటని ప్రశ్నించారు. వెంటనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంత పెద్ద ఘటన జరిగినా కేంద్ర మంత్రి బండి సంజరు రాజీనామా చేయక పోవడం సిగ్గుచేటన్నారు. పేద ప్రజలు, కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ : జూలకంటి రంగారెడ్డి
ప్రపంచంలో ట్రంప్‌.. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థల ను దిగజారుస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూల కంటి రంగారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద అమెరికా విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోడీ దేశంలోని అన్ని వ్యవస్థలనూ దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈ మధ్య రాష్ట్రంలో హిందూ సమ్మేళ నాలతో ప్రజల మధ్య మత ద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సమ్మేళనాలతో ప్రజల జీవితాలు మారవని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని పెట్టుబడి విధానం వైపు నడిపిస్తున్నారని, దేశంలో 40 శాతం సంపద ఒక్క శాతం ఉన్న వర్గమే అనుభవిస్తోందని వివరించారు. ఈ క్రమంలో ఎర్రజెండా నాయకత్వంలో మరిన్ని సమరశీల పోరాటాలు రాబోతున్నాయని చెప్పారు. ఎర్రజెండా నిరంతరం సమ సమాజం కోసమే పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి, పార్టీ యాచారం మండల కార్య దర్శి ఆలంపల్లి నరసింహ, నాయకులు బోడ సామెల్‌, డి.రామచందర్‌, ఈ. నరసింహ, డి.జగదీష్‌, చంద్రమోహన్‌, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -