- Advertisement -
ఆసియా అండర్-17
బాక్సింగ్ పోటీలు
తాష్కెంట్ (ఉబ్బెకిస్తాన్) : ఆసియా అండర్15, అండర్17 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌ను టీమ్ ఇండియా ఘనంగా ముగించింది. రెండు వయో విభాగాల్లో బాలురు, బాలికలు ఏకంగా 17 పతకాలు సాధించారు. ఇందులో రెండు పసిడి, ఏడు రజత, ఎనిమిది కాంస్య పతకాలు ఉన్నాయి. అండర్-17 బాలికలు 12 పతకాలు అందుకున్నారు. అండర్-17 బాయ్స్ ఐదు పతకాలు సాధించారు. బాలికల 46 కేజీల విభాగంలో రాఖి పసిడి పతకం సాధించగా, 57 కేజీల విభాగంలో నవ్య సైతం స్వర్ణం అందుకుంది. ఖుషి చంద్ (48కేజీలు), దివ్య (63 కేజీలు), హిమాన్షి (70 కేజీలు), జ్యోతి (75 కేజీలు), వాన్షిక (80 కేజీలు)లు రాణించారు.
- Advertisement -



