Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనుల వద్ద కనీస వసతులు కల్పించాలి

ఉపాధి హామీ పనుల వద్ద కనీస వసతులు కల్పించాలి

- Advertisement -

ఆంగోతు సుగుణ, మార్కెట్తి కమిటీ ఛైర్పర్సన్ పంతకాని తిరుమల 
నవతెలంగాణ-కాటారం 

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంగోతు సుగుణ, కాటారం ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల ఆరోపించారు. శనివారం  కాటారం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వారు సందర్శించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ పనుల వద్ద నీడ సౌకర్యం, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోయారు. వెంటనే మండల ఏపీఓ వెంకన్నకు ఫోన్ చేసి సమస్యలను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.

అనంతరం ఆంగోతు సుగుణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా కూలీల ఉపాధి హక్కును దెబ్బతీయాలని కుట్ర జరుగుతోందన్నారు. కూలీలకు పూర్తి స్థాయిలో పని దినాలు కల్పించి, పనుల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కూలీలు జోడు రాజన్న, సత్యం, వెంకటయ్య, మల్లయ్య తదితరులు తమ సమస్యలను వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -