ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ- మోపాల్: మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో కులాస్పూర్ బాడ్సి తదితర గ్రామాలలో కిసాన్ కేతు జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా ముప్పగంగ రెడ్డి మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని కచ్చితంగా మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే రుణమాఫీ సాధ్యమవుతుందని ప్రజల ఆలోచించి ఓటు వేయాలని 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసి విరక్తి చెందారని, డాక్టర్ భూపతి రెడ్డి గారికి ఓటు వేసి భారీ విజయనందించాలని రూరల్ నియోజకవర్గం లోని మోపాల్ మండల్ అత్యధిక మెజార్టీ ఇస్తున్న ఆశిస్తున్నామని అలాగే   కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో చూసి మిగతా పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని కచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకం ప్రజలకు అమలు చేసి తీరుతామని, మాది కుటుంబ పాలన కాదని దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలర్పించిన నాయకుల పార్టీ అని పదవికాంక్షలేని పార్టీ అని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి సైతం  వదులుకున్నాడని ప్రజలకు సేవ చేయడం తప్ప పదవులపై వ్యామోహం లేదని గాంధీ కుటుంబానికి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయి రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ సూర్య రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు భారీ మొత్తంలో పాల్గొన్నార.

Spread the love