‘సుడిగాలి సుధీర్’గా పాపులరైన సుధీర్ ఆనంద్ టెలివిజన్, సినిమా రంగాలలో అలరిస్తున్నారు. ఆయన తాజా ప్రాజెక్ట్ ‘హై లెస్సో’తో ప్రసన్న కుమార్ కోట దర్శకుడిగా పరిచయం కాగా, వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. హీరోగా సుధీర్ ఆనంద్ నటిస్తున్న ఐదవ చిత్రం ఇది. ఈ చిత్రంలో నటుడు శివాజీ విలన్గా నటిస్తున్నారు. సుధీర్ ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ కథలో స్ట్రాంగ్ ఎమోషన్స్ డ్రామా ఉండబోతున్నాయి. సుధీర్ ఆనంద్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 25 రోజుల పాటు కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. ఇందులో ప్రధాన టాకీ పార్ట్‌తో పాటు జాతర సీక్వెన్స్‌లు, ఒక పాటను చిత్రీకరించారు. త్వరలోనే ఏలూరులో 40 రోజుల భారీ షెడ్యూల్ ప్రారంభం కానుండగా, దాంతో మొత్తం షూటింగ్ పూర్తికా నుంది అని మేకర్స్ అన్నారు.



