Thursday, May 21, 2026
E-PAPER
Homeసినిమా'డ్రాగన్`గా ఎన్టీఆర్

‘డ్రాగన్`గా ఎన్టీఆర్

- Advertisement -

ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌ వంటి క్రేజీ కాంబోలో రూపొందుతున్న సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ సినిమా టైటిల్‌ను ‘డ్రాగ‌న్‌’గా ఖరారు చేస్తూ ఎన్టీఆర్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుద‌లైంది. 4 నిమిషాల 28 సెక‌న్ల ఈ గ్లింప్స్ 1967 నేపథ్యంలో నడిచే చీకటి ప్రపంచాన్ని చూపిస్తుంది. రుక్మిణి వ‌సంత్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఆమె ప‌విత్ర‌మైన‌ బైబిల్ గ్రంథంలోని తొలి అధ్యాయాన్ని వివ‌రిస్తుంటుంది. ఆమెకు వాయిస్ ఓవ‌ర్‌కు అనుగుణంగా ప్ర‌తి వాక్యానికి అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన భ‌యంక‌ర‌మైన‌, క్రూర‌మైన విల‌న్స్‌ను చూపించారు. అలాగే వీరికి మించి దెయ్యంగా ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసిన తీరు అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్ న‌టుడు అనీల్ క‌పూర్ర్, బిజూ మీన‌న్‌, రుక్మిణి వ‌సంత్, ఖుష్బూ సుంద‌ర్‌, గురు సోమ‌సుంద‌రం, రాజీవ్ క‌న‌కాల‌, అశుతోష్ రానా, అన్షుమ‌న్ పుష్క‌ర్‌, సిద్ధాంత్ గుప్తా, ప్ర‌భాస్ శ్రీను, శ‌త్రు, శివ, భీమ‌ల్ జీత్ ఒబెరాయ్ త‌దిత‌రులు త‌మదైన న‌ట‌న‌తో మెప్పించ‌నున్నారు. డ్రాగ‌న్ మూవీపై ఆస‌క్తిని, ఉత్సాహాన్ని పెంచేలా చిత్రబృందం సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జూన్ 11వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారీ రిలీజ్ డేట్‌గా ఇది మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -