నవతెలంగాణ -ఆర్మూర్ : పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి జీవన్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ గాంధీ భవన్ కు చెందిన నాయకులు బుధవారం హాజరై ప్రచారం చేశారు. సోనియా గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మారేడ్పల్లి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్కట్ జగన్, వెంగల్ రావు, సీనియర్ కాంగ్రెస్ మాజీ నాయకుడు చాకో, ప్రసాద్, నవీన్, అజయ్, నాని పాల్గొన్నారు.