నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్ పట్టుదల, జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషి ఫలితంగా శనివారం గ్రామానికి పల్లె వెలుగు బస్సు ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కృషికి గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలు ఏళ్ల తరబడి గ్రామానికి బస్సు కోసం ఎదురుచూసే దానిని ఎమ్మెల్యే తమ మాటను నిలబెడుతూ గ్రామ ప్రజల సౌకర్యార్థం పల్లె వెలుగు బస్సు నడిపించడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బాన్సువాడ డిపో అధికారులకు ఆదేశాలతో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి బస్సుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
అనంతరం బస్సు డ్రైవర్ కండక్టర్లకు ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించారు. గ్రామ సర్పంచ్ పట్టుదల ఎమ్మెల్యే కృషి ఫలితంగా గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం కలగడంతో గ్రామ ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. బస్సు ప్రారంభత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవకత్తే జయశ్రీ దేవిదాస్ పటేల్, ఉప సర్పంచ్ డి కవిత విట్టల్ రావు , ఎక్స్ ఎంపీటీసీ యాదరావు పటేల్, పంచాయతీ వార్డ్ మెంబర్స్ కే. గోవింద్, ఎస్ రమామాదు, గ్రామ పెద్దలు లుటే పాండురంగ గ్రామస్తులు పాల్గొన్నారు. బస్సు రూట్ బిచ్కుంద టు మర్కెల్ వయ దన్నూర్ టైమింగ్ ఉదయం 09:45 బిచ్కుంద టు మరికల్ సాయంత్రం 05:00 మరికల్ టు బిచ్కుంద ఈ విధంగా పొద్దున సాయం ధన్నూర్ గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించారు.



