– ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాల్లో జనగణను ప్రకటన నిర్వహించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. శనివారం మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి గ్రామాల్లో కొనసాగుతున్న జన గణనను తీరును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్లకు, ఏనుమిరేటర్ లకు పలు సలహాలు సూచనలు చేశారు. జనగణనలో పొందుపరచాల్సిన కుటుంబం యొక్క పూర్తి వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వ నిర్వహించాలన్నారు. ప్రతిరోజు నిర్దేశించిన లక్ష్యం మేరకు జనగణన పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడా జనగణన చేస్తున్న సూపర్వైజర్లకు, ఏనుమిరేటర్ పూర్తి సమాచారం అందించి సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, మండల రెవెన్యూ అధికారి శరత్, తదితరులు ఉన్నారు.
జన గణన ప్రకడ్బందీగా నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



