Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి

నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి

- Advertisement -

25న జరుగే బైక్ యాత్రను జయప్రదం చేయండి
నవతెలంగాణ- దామరగిద్ద
మండల పరిధిలోని కంసాన్పల్లి మత్తుగుండ్ల, సజనాపూర్ గ్రామాల్లో ఈ నెల 25న జరుగు బైక్ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేసి ముమ్మార ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, సిసీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మన గ్రామాల రోడ్ల దుస్థితి మారలేదని అన్నారు. కంసాన్పల్లి నుండి ఏ గ్రామానికి వెళ్లాలన్న రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని అన్నారు.

పెద్రిపాడు నుండి బొమ్మను పాడు వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనుల జాప్యం కారణంగా ప్రయాణము కష్టతరంగా మారిందని అన్నారు రోడ్డు పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మద్దూరు నుండి నారాయణపేటకు పెరపల్ల, వత్తుగుండ్ల మీదుగా మంజూరై నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నాప్పటికీ పూర్తిగాకపోవడం ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా పోయిందని అన్నారు. వత్తుగుండ్ల నుండి నారాయణపేట వరకు పెండింగ్ లో ఉన్న డబల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో ఉన్న పాడైపోయినటువంటి బీటీ రోడ్లను బాగు చేయాలని మట్టి రోడ్లను బీటీగా మార్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన బైక్ యాత్రను అన్ని గ్రామాల ప్రజలు యువకులు , స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జోషి,శివకుమార్, శ్రీనివాస్,మల్లేష్,ప్రకాష్, షేర్,వార్డు మెంబెర్ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -