నవతెలంగాణ-కంఠేశ్వర్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా.. వర్ధన్ హాస్పిటల్‌లో డా.సృజిల్ బాబు తేడ్డు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సమాజ సేవకు అంకితభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో పలువురు ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనలు పొందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
వర్ధన్ హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



