Tuesday, May 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ కల్లెపు శంకర్‌ను పరామర్శించిన సీపీఐ(ఎంఎల్) నాయకులు

కామ్రేడ్ కల్లెపు శంకర్‌ను పరామర్శించిన సీపీఐ(ఎంఎల్) నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్: ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు,మాజీ ఉపసర్పంచ్,రైతు–కూలీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కామ్రేడ్ కల్లెపు శంకర్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ,అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు మారుజోడు సిద్దేశ్వర్, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి యెలగందుల సిద్దులు తదితరులు కల్లెపు శంకర్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు కల్లెపు చంద్రయ్య, వడ్డేపల్లి బాలరాజు, గజరాజ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -