నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని గాయత్రి నగర్ లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్టి మహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొని వారి మద్దతు కోరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు బాగుపడతాయని అయన తెలిపారు. విశ్వబ్రాహ్మణులు తరతరాలుగా కులవృత్తి చేపడుతున్నారు. వారి తరాలు మారాయి గాని తలరాతలు మారలేదు. విశ్వబ్రాహ్మణుల సమస్యలు వర్ణించలేనివి తమ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీకు మంచి చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. శ్రీకాంతాచారి బలిదానాల పైన గద్దె ఎక్కిన వాళ్ళు ఈరోజు వారిని ఎద్దేవా చేస్తూ గొట్టం గాళ్లు అంటూ కేటీఆర్ కించపరుస్తున్నారు. మీరందరూ మేల్కోండి ప్రజా కంటక ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలు పేరుకే తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు బాగుపడతాయని అయన తెలిపారు. ప్రతీ ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కేసీఆర్ రాజకీయ జీవితానికి చమర గీతం పాడాలన్నారు.