Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించిన సర్పంచ్

నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర : పెద్దవూర మండలం కేంద్రం లోని పెద్దావూర మేజర్ గ్రామ పంచాయతీ లో ప్రజా సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఐతబోయిన వెంకటయ్య గౌడ్ ప్రత్యేకంగా పట్టు బిగించారు. ఇప్పటికే ఎస్ సి కాలనీలో సీసీ రోడ్లు వేయించారు.అదేవిదంగా బుధవారం మండల కేంద్రం లో నీటి కొరత ఉందని గమనించిన ఆ గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా రెండు బోర్లు వేయించారు.వేసవి కాలంలో తాగు నీటి సమస్య రాకుండా ఉండడానికి పెద్దవూర గ్రామ పంచాయతీ లో బోర్లు వేయించారు.సందర్భంగా సర్పంచ్ ఐతబోయిన వెంకటయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వార్డులలో పాలకవర్గం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు.ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ పంచాయతీ పదృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాటి నర్సింహ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఊరే వెంకన్న, వార్డు మెంబర్లు పాకాల అంజయ్య,ఊరే శ్రీను,కాంగ్రెస్ నాయకులు ఐతగోని సతీష్,ఊరే అంజయ్య,కోట వెంకటయ్య,బాలగౌడ్, హనుమంత్ రెడ్డి,రంజాన్,బొడ్డు వెంకన్న, శివ, అంజి రెడ్డి, రాంబాబు, అనిల్, శంకర్, సతీష్, కోమల్ల కోటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -