– కమ్మర్ పల్లి సింగిల్ విండో చైర్మన్ రేగుంట దేవేందర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
భూసారాన్ని పెంపొందించేందుకు జీలుగా విత్తనాలు దోహదపడతాయని కమ్మర్ పల్లి సింగిల్ విండో చైర్మన్ రేగుంట దేవేందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద కమ్మర్ పల్లి సహకార సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు భూసారాన్ని పెంపొందించే జీలుగు విత్తనాలను చైర్మన్ రేగుంట దేవేందర్ చేతుల మీదుగా జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 50 శాతం సబ్సిడీపై రూ. 2453 ఒక జీలుగా బస్తా అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, సీఈఓ శంకర్, పాలకవర్గం సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
భూసారాన్ని పెంపొందించే జీలుగు విత్తనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



