Thursday, May 28, 2026
E-PAPER
Homeజాతీయంపార్కింగ్ విషయంలో గొడవ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతపై కాల్పులు

పార్కింగ్ విషయంలో గొడవ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతపై కాల్పులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత జైపాల్ సింగ్ బాహుపై పొరుగింటి వ్యక్తి కాల్పులు జరిపాడు. గురువారం మధ్యాహ్నం పార్కింగ్ వివాదంతో మొదలైన గొడవ తీవ్రమై, కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో జైపాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -