వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపై తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించిన మ్యాగజైన్ కాలమిస్ట్, రచయిత ఈ.జియాన్ కరోల్‌పై న్యాయ శాఖ విచారణ ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రంప్‌పై పెట్టిన సివిల్ కేసులకు సంబంధించి ఆర్థిక సాయం పొందే విషయంలో ఆమె అబద్ధపు సాక్ష్యం చెప్పారా లేదా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని ఆ వర్గాలు చెప్పాయి. ట్రంప్‌పై కరోల్ లైంగిక దాడి, నష్టపరిహారానికి సంబంధించి రెండు కేసులు పెట్టారు. ఈ కేసులలో ఆమెకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయితే లైంగిక దాడి ఆరోపణల కేసులో తీర్పును కొట్టివేయాలంటూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా జ్యూరీ ఒకటి 2023లో ట్రంప్‌ను లైంగిక దాడికి బాధ్యుడిగా నిర్ధారించింది. తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పెట్టిన ఓ పోస్టుకు సంబంధించి దాఖలైన పరువునష్టం కేసులో కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 1990వ దశకం మధ్యలో ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూములో తనపై లైంగిక దాడి జరిగిందని కరోల్ ఆరోపించగా ట్రంప్ ఆ పోస్టులో దానిని ఖండించారు. కాగా ఓ పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం కరోల్ తనపై లైంగిక దాడి ఆరోపణలు చేశారంటూ 2019లో ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ కరోల్ ఆయనపై పరువునష్టం దావా వేశారు. కరోల్‌కు ఐదు మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ జ్యూరీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ట్రంప్ సవాలు చేశారు. కరోల్‌కు 83 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలంటూ ఇచ్చిన మరో తీర్పుపై కూడా అప్పీలు చేస్తానని ఆయన చెప్పారు.
ట్రంప్‌పై లైంగిక దాడి ఆరోపణలు చేసిన…మ్యాగజైన్ కాలమిస్టుపై విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



