నవతెలంగాణ-ఊరుకొండ: ఊరుకొండ మండలంలోని గుడి గాని పల్లి గ్రామానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ లు రానున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు అయ్యుబ్ పాష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరియు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ లు ఊర్కొండ మండల పరిధిలోని గుడిగానిపల్లి గ్రామంలో సి ఎస్ ఆర్ ఫౌండేషన్ (ఆరోబిందో ఫార్మా) వారి సౌజన్యంతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు..కావున మండల పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ మిత్రులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.
నేడు మండలానికి ఎమ్మెల్యే కలెక్టర్ రాక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



