నవతెలంగాణ – ఆలేరు టౌను : ఆలేరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఎఫ్ పి ఓ, పి ఏ సి ఎస్, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలుని మరింత వేగవంతం చేస్తామని, మార్కెట్ కమిటీ చైర్మన్, ఐనల చైతన్య మహేందర్ రెడ్డి అన్నారు. మార్కెట్ సెక్రటరీ పద్మజ, డైరెక్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట , మోటకొండూరు, మండలాలల పరిది 69 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. సెంటర్లలో ప్యాడి క్లీనర్ , వేయింగ్, మ్యాచర్ మిషన్ లు,టార్ ఫాలింగ్ లకి ఎక్కడ లోటు లేకుండా చూస్తున్నామన్నారు. కొన్ని చోట్ల యంత్ర పరికరాలు మొరాయిస్తున్నప్పటికీ, మరపుమత్తులు చేపడుతున్నామని, రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలనీ ,దీనికి మార్కెట్ కమిటీ నుండి పూర్తి సహకారం అందిస్తామని డైరెక్టర్లు ముక్తకంఠంతో తెలియజేశారు. ఇప్పటివరకు 421 మంది రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకువచ్చారని, 408 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం 28,618, 80 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకి తరలించడం జరిగిందన్నారు.
మార్కెట్ వచ్చే చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.
గత సమావేశం లో తీర్మానంచిన పనుల యొక్క పురోగతి గురించి,
జమా ఖర్చుల గురించి చర్చించి,
ఇతర అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో మార్కెట్ సహాయ అధికారి దివ్య, డైరెక్టర్లు , ఎగిడి యాదగిరి, చిలుకు కిష్టయ్య, సిలువేరు బాలరాజు, విట్టల్ నాయక్, పట్టు నాయక్, నజీరుద్దీన్, జహంగీర్, ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి, మార్కెట్ సూపర్వైజర్ శ్రీనివాస్, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.



