Friday, May 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పిప్పిరి మార్కెట్ సబ్‌యార్డ్‌కు గ్రీన్ సిగ్నల్...

పిప్పిరి మార్కెట్ సబ్‌యార్డ్‌కు గ్రీన్ సిగ్నల్…

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్: మండలంలోని పిప్పిరి గ్రామంలో మార్కెట్ సబ్‌యార్డ్ మంజూరు చేయడంపై రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 33, తేదీ 27-05-2026 జారీ చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. గతంలో భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా రైతులు మార్కెట్ సబ్‌యార్డ్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పిప్పిరి మార్కెట్ సబ్‌యార్డ్‌కు ఆమోదం తెలిపిందన్నారు.

మార్కెట్ సబ్‌యార్డ్ ఏర్పాటుతో బజార్హత్నూర్ మండల రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రమణారావు, ప్రేమ్ సాగర్‌రావు, ఆది శ్రీనివాస్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిప్పిరి సర్పంచ్ కృష్ణకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జల్కె పాండురంగ్, చిలుకూరి భూమన్న, గవ్వల దేవేందర్, కళ్లెం విట్టల్, విజేందర్, విలాస్, శ్రీనివాస్, గాండ్ల రమేష్, చట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -