Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యశాఖ అధ్వర్యంలో కుష్టు వ్యాధి నివారణపై ప్రతిజ్ఞ

ఆరోగ్యశాఖ అధ్వర్యంలో కుష్టు వ్యాధి నివారణపై ప్రతిజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో ఆరోగ్య శాఖ అధ్వర్యంలో ఆరోగ్య ఉపకేంద్రం వద్ద కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా, వారికి అవగాహన కల్పించి సరైన చికిత్స అందించడం ద్వారా భవిష్యత్తులో కుష్టు రహిత గ్రామంగా రామేశ్వర్‌పల్లిని నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి , సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏఏంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, ఏఎన్‌ఎం మాధవి, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రెటరీ శ్యామ్, ఉపాధ్యాయులు, ఐకెపి సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -