Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత వ్యాపార రంగంలోకి రావాలి.. 

యువత వ్యాపార రంగంలోకి రావాలి.. 

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ :  యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించు కోవాలని తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే యువత పారిశ్రామిక రంగంలో రాణించాలని, దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు, ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యాపార రంగంలో ముందుకు రావాలని కోరారు.

వ్యాపార కేంద్రాలు, పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వ్యాపార నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే అంశాలపై చాలా మంది యువతకు సరైన అవగాహన లేదని పేర్కొన్నారు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేయడంలో మిక్కి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. విజయం సాధించిన పారిశ్రామికవేత్తల అనుభవాల నుంచి స్ఫూర్తి పొందడంతో పాటు, వ్యాపారంలో ఎదురైన వైఫల్యాల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించి వారిని సమర్థ ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.

పరిశ్రమల స్థాపనలో అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. నిబద్ధత, కృషి, సంకల్పం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని యువతకు సందేశం ఇచ్చారు. సదస్సులో ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలు, యువత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు తక్కిళ్ళ విప్లవ గాంధీ, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, ప్రచార కార్యదర్శి ఉమాపతి, కోశాధికారి శ్రీనివాసరాజు, డైరెక్టర్ దుబ్బా నాగేశ్వర్, మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత, సురేష్ కుమార్, నాగేంద్ర గౌడ్, రవివర్మ,శోభారాణి తదితరులు ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -