Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

- Advertisement -

– రైస్ మిల్లుల వద్ద 24 గంటల్లో ధాన్యం అన్‌లోడింగ్ చేయాలి
– అదనపు కలెక్టర్ బి.ఎస్.లత
నవతెలంగాణ – రాయికల్:
మండలంలోని మైతాపూర్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, శివమణి పారా బాయిల్ రైస్‌మిల్లును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో హమాలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని, ధాన్యం లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లారీలను ఆలస్యం లేకుండా రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు.ట్రాక్ షీట్ నమోదు,ట్యాబ్ ఎంట్రీలు తదితర డాక్యుమెంటేషన్ పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు సరైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పరిశీలించాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. అనంతరం రైస్‌మిల్లులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్,మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచాలని, ధాన్యంతో వచ్చిన లారీలను 24 గంటల్లోగా అన్‌లోడ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం అన్‌లోడింగ్‌లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైస్‌మిల్లర్లు, అధికారులు పరస్పర సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు సజావుగా, వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ నాగార్జున, ఆర్.ఐ పద్మయ్య,దేవదాస్,మిల్లు యాజమాన్యం గన్నె సుధాకర్, సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -