నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, ఎస్ ఐ ఆర్ , మీసేవ అప్లికేషన్స్ పెండింగ్, కోర్టు కేసులు, ధాన్యం కొనుగోలు, వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మండల తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం వీసీ హాల్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి మండల తాసిల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి, రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు, మీ సేవలో వచ్చిన దరఖాస్తులను దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలన్నారు.. భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలన్నారు. ఎస్ ఐ ఆర్ , కోర్టు కేసులు, జనాభా గణన పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ,రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, మండల తహసీల్దార్ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని తాసిల్దారులను ఆదేశించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



