Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

తాడిచెర్లలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలో ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు, భూములకు పరిహారం ఇప్పిస్తానని మాట నిలబెట్టుకొని రూ.261 కోట్ల నిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఖాతాలో జమయ్యేలా కృషి చేసిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతగా శనివారం భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు, ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,డేంజర్ జోన్ నిర్వాసితుల ఆధ్వర్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకాలు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో మంత్రి పుట్టినరోజు వేడుకలు అంగారంగావైభవంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముందుగా డేంజర్ జోన్లోఎస్సికాలని నుంచి జైశ్రీదర్ బాబు,జైజై శ్రీదర్ బాబు అంటూ పాత బంగ్లా వరకు వేలాదిమంది ప్రజలు ర్యాలీగా వెళ్లారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిర్వాసితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు మంజూరైయ్యేలా కృషి చేసిన గొప్ప నాయకుడు శ్రీదర్ బాబన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన కిషన్ రావు పల్లి నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు రోడ్డు నిర్మాణం అయ్యేలా,నియోజకవర్గంలో విద్య,వైద్య వసతులు, పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులకు నిధులు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత శ్రీదర్ బాబుని చెప్పారు. డేంజర్ జోన్లో ఉన్న ప్రతి భూ నిర్వాసితునికి న్యాయం జరగాలంటే అది కేవలం శ్రీధర్ బాబుతో మాత్రమే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మల్లారం మేకల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇందారపు చెంద్రయ్య, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, తిర్రి అశోక్, పైడాకుల దేవేంద్ర, సారయ్య, కాంగ్రెస్ నాయకులు దన్నపనేని అశోక్ రావు, సురేష్ రావు, కేశారపు చెంద్రయ్య, ఇందారపు ప్రభాకర్, శివ, తాండ్ర మల్లేష్, కుంట సది, రాజ సమ్మయ్య, కొండూరి మమత, లింగయ్య, రాజు నాయక్ తోపాటు మహిళ నిర్వాసితులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -