– ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు లకావత్ సవేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు : మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుని మండల ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు లకావత్ సవేందర్ అన్నారు. శ్రీదర్ బాబు జన్మించిన వేడుకల్లో భాగంగా మండలం కొయ్యురు గ్రామంలో శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఉపాధి హామీకూలీల వద్దకు వెళ్లి కేక్ కట్ చేసి స్వీట్స్,మజ్జిగ పాకెట్స్ పంపిణి చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదర్ బాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లాకావత్ లక్ష్మి-తిరుపతి, ఏడ్ల మధుశుదన్, పంతకాని శేషివర్ధన్, గ్రామస్తులు, కూలీలు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాత మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



