Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుక్కలు, కోతుల సమస్యలను నివారించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి

కుక్కలు, కోతుల సమస్యలను నివారించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి

- Advertisement -

 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : భువనగిరి పట్టణం లో నిత్యం ప్రజలు కుక్కలు, కోతుల బారినపడి గాయాలు ఈ మధ్యకాలంలో కావడం జరుగుతుందని, వాటి భారీ నుండి పట్టణ ప్రజలను కాపాడాలని బిఆర్ఎస్ పార్టీ, మున్సిపల్  కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..తారకరామ నగర్ లో ఒక బాబు కన్ను కోల్పోవడం జరిగిందని, శుక్రవారం  హౌసింగ్ బోర్డు లో చిన్న బాబు తీవ్ర గాయాల పాలు కావడం జరిగిందని, అయినా కూడా మున్సిపల్ పాలకవర్గం అధికారులు మొద్దు నిద్ర నటిస్తూ ఎమర్జెన్సీ కానీ వాటికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ నిజంగా అత్యవసరం ఉన్న వాటికి చర్చించక పోవడం చాలా బాధాకరం అన్నారు. 

సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కల మీద ఉత్తర్వులు  ఇచ్చినప్పటికీ భువనగిరి పట్టణంలోని 35వార్డు లలో కుక్కలను, కోతులను వెంటనే పట్టాలని లేనియెడల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.  భువనగిరి పట్టణంలో మెప్మా విభాగంలో భారీ అవినీతి జరిగిందని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్న మున్సిపల్ కార్యాలయం నుండి ఈరోజు వరకు కూడా ఎంత అవినీతి జరిగిందో పేపర్ ప్రకటన కానీ అవినీతి చేసిన అధికారుల మీద ఆర్పీలను  అవినీతి చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని లేనియెడలో బిఆర్ఎస్ పార్టీ తరఫున రానున్న రోజులలో పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ  పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -