నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : డిఆర్డిఏ – సెర్ప్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఉచిత కుటుంబ సలహా కేంద్రం (జెండర్ రిసోర్స్ సెంటర్-)ను మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ సమస్యలు, మహిళల హక్కులు, లింగ వివక్ష, గృహ హింస, ఆరోగ్యం, పోషకాహారంపై ఉచితంగా న్యాయ, మానసిక సలహాలు అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మండల్ స్థాయి సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుందని, బాధితులు నేరుగా వచ్చి సేవలు పొందవచ్చని సూచించారు.
ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ తంగా ళ్ల పల్లి శ్రీవాణి రవి కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, ఎంపీడీవో దినకర్, వార్డు కౌన్సిలర్ యాసిన్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రసాల శిరీష, కార్యదర్శి ఏదునూరి వాణి, కోశాధికారి కవిత, ఏపీఎం పాశికంటి మల్లేశం, సీసీలు అఫ్సర్, అలివేలు, మల్లేష్, కవిత, అకౌంటెంట్ పుష్ప, జి ఆర్ సి సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు చొక్కా కుమారి, తిరుమల, సత్యలక్ష్మి, అంజమ్మ, మౌనిక, కవిత పాల్గొన్నారు.


