Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ పాత బస్టాండ్ లో ఆటోలతో ప్రయాణికులకు ఇబ్బందులు

మద్నూర్ పాత బస్టాండ్ లో ఆటోలతో ప్రయాణికులకు ఇబ్బందులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రం మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దు లో ఉంది. ఇక్కడి నుండి ప్రయాణికులు మహారాష్ట్రకు కర్ణాటక కు అదే విధంగా తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం మద్నూర్ పాత బస్టాండ్ లో నిలుస్తారు. బస్టాండుకు ఎదురుగానే బస్సులు నిలబడడానికి ఇబ్బందికరంగా ఆటోలను నిలబెట్టడం బస్సుల్లో ఎక్కడానికి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుందని, ప్రయాణించే ప్రయాణికులో ఆవేదన వ్యక్తం అవుతుంది. బస్సులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, వెళ్లే సమయంలో బస్టాండ్ లో ప్రయాణికుల కోసం బస్సులు ఆపాలంటే ఆటోలు అడ్డంగా ఉండటం బస్సులు ఆటోల కంటే వెనకనా లేకుంటే వాటిని దాటి ముందుకు వెళ్లి నిలబెట్టవలసి వస్తుందని, బస్సు కోసం ప్రయాణికులు పరుగులు తీసే ప్రయత్నంలో ఆటోలతో ఇబ్బందిగా మారిందని, బస్టాండ్ కి ఎదురుగా ఆటోలో నిలబెట్టకుండా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -