– డోంగ్లి తహసిల్దార్ రంజిత్ కుమార్
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో శనివారం నాడు తహసిల్దార్ రంజిత్ కుమార్ మండల రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుదారుల ఈకేవైసీ ప్రక్రియపై ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని, లేనిపక్షంలో సరుకులు పంపిణీ చేయడంలో ఇబ్బంది అవుతుందని, డీలర్లకు స్పష్టం చేశారు. ఈకేవైసి చేయించుకోని కార్డుదారులకు అవగాహన కల్పించి, ప్రక్రియ పూర్తి చేయడంలో డీలర్లు చొరవ చూపాలని తహసిల్దార్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవనిహెచ్చరించారు. రేషన్పంపిణీలోపారదర్శకత,సమయపాలన పాటించాలని, డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయి బాబా, కార్యాలయ సిబ్బంది సాయిలు, రేషన్ డీలర్లు షబ్బీర్ పటేల్, మాధవ్ రావ్ పటేల్, హనుమంత్ రెడ్డి, సంతోష్, గంగాధర్, పాటు మండల డీలర్లు పాల్గొన్నారు.
ఈకేవైసి చేయించుకూనేలా రేషన్ కార్డుదారులకు అవగాహన కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



