నవతెలంగాణ – జన్నారం: వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాలో వ్యక్తులను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా అడ్మిన్ లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలు అందించారు. గ్రూపు అడ్మిన్లు ఏ ఉద్దేశంతో గ్రూపు ఏర్పాటు చేశారో, ఆ నిబంధనలు కచ్చితంగా గ్రూపు సభ్యులంతా పాటించాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యక్తులను మొట్టమొదటిసారిగా హెచ్చరిస్తూ గ్రూపులలో నుంచి రిమూవ్ చేయాలన్నారు. లేకుంటే గ్రూప్ అడ్మిన్ పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. వాట్సాప్ గ్రూపులు సమాచారాన్ని ప్రజలకు గ్రూప్ సభ్యులకు అందించే విధంగా ఉండాలి కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఒకరిపై ఒకరు దూషించుకునే విధంగా ఉండకూడదు అన్నారు. ఎలాంటి సమాచారం ఉన్న పోలీసులకు అందించాలని సూచించారు. గ్రూప్ కు సంబంధించిన ఏ విషయమైనా గ్రూప్ అడ్మిన్దే బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు: సీఐ రమణామూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



