నవతెలంగాణ – ఆలేరు టౌన్ : ఆలేరు పట్టణంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బిక్షాటన చేసుకుంటున్నా గుర్తుతెలియని వ్యక్తికి శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బైపాస్ రోడ్ లో చత్రపతి శివాజీ దాబా వద్ద రోడ్డుపై వెళ్తున్న భిక్షాటన చేసే ప్రభాకర్ వయస్సు (65), టీఎస్ జీరో 8 హెచ్ వై 4298 నెంబర్ గల ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కాగా 100 డయల్ సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మరియు పోలీసులు అక్కడికి చేరుకొని, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కొరకు వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రమాదానికి గురైన భిక్షాటన చేసే వృద్ధిడి బంధువులు, వివరాలు తెలిసినవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించగలరని ఎస్సై ఎన్ వినయ్ కుమార్ తెలియజేశారు.



