Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

- Advertisement -

నియామకపత్రాన్ని అందజేసిన డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ 
నవతెలంగాణ – చిన్నకోడూరు 

మండల కేంద్రానికి చెందిన రెడ్డి మహేందర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు శుక్రవారం నియామకపత్రాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ అందజేశారు. ఈ సందర్బంగా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా నియమించిబడ్డ మహేందర్ రెడ్డి ని గజమాలతో ఘనంగా సన్మానించి మాట్లాడారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ తోనే సంబండావర్గాల అభివృద్ధి చెందుతాయన్నారు. నూతనంగా నియమకమైన మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నా నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి,కిసాన్ సెల్ నాయకులూ మహిపాల్ రెడ్డి ,నాయిని నరసింహా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. శక్తివంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులూ బీసీ సెల్ మండల అధ్యక్షులు, వార్డ్ మెంబెర్ బంక చిరంజీవి, మాజీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రెటరీ కల్లూరి నర్సింలు, చిన్నకోడూరు గ్రామా శాఖ అధ్యక్షులు గుడిమళ్ల, మల్లేశం, గుండు వెంకట్, కుమార స్వామి, ఒగ్గు కిసాన్, కర్ణాకర్ , యేసు కనకయ్య, కొట్టాల వెంకట్ రెడ్డి, మట్ట మల్లారెడ్డి, రాజు, గణేష్ , సురేష్ , కృష్ణ , రవి , రాజనర్సింలు ,మల్లేశం, పంజా కుమార్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -