అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి) భౌతిక శాస్త్రం విభాగం, తెలంగాణ యూనివర్సిటీ డా. సరిత పిట్ల
నవతెలంగాణ-కంఠేశ్వర్
నీళ్లు , నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం ఆనాడు తెలంగాణలోని యూనివర్సిటీలను మండించింది. విద్యార్థులు ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని తెలంగాణ యూనివర్సిటీ లకు ఉద్యమం పాకింది. ఆనాటి ప్రభుత్వం ఉద్యమం ఆపడానికి యూనివర్సిటీ లకు సెలవులు ప్రకటించినా, మెస్ లు మూసివేసినా ఉద్యమం ఆపలేదు. అరెస్ట్ లు చేసినా,కేసు లు పెట్టినా వెనకడుగు వెయ్యలేదు.
రాజకీయ నాయకుల మోసపూరిత మాటలకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉద్యమం కొనసాగింది. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా జాక్ లు ఏర్పడ్డాయి. విద్యార్థులు, యువత, వామపక్షాలు,విప్లవ సంస్థలు, సబ్బండ వర్గాలు కలిసి తెలంగాణ ఆకాంక్షను దేశ,విదేశాలకు చాటి చెప్పాయి. ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తన అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకు సాగుతోంది. జూన్ 2,2014 న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు.



