Wednesday, June 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశంలోని ఆర్టీసీలకు తెలంగాణ ఆదర్శం

దేశంలోని ఆర్టీసీలకు తెలంగాణ ఆదర్శం

- Advertisement -


ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ విజయవంతం
రాష్ర్ట ఆవిర్భావ వేడుకల్లో ఎండీ నాగిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడుపుతూ అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ వైస్‌‌చైర్మెన్‌, ఎండీ వై. నాగిరెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు చారిత్రాత్మక చేయూతను ఇచ్చినట్టు చెప్పారు. బస్సుల్లో రద్దీ పెరిగినప్పటికీ అద్భుతంగా సేవలందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ బస్‌‌భవన్‌‌లో 12వ తెలంగాణ ఆవర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనందరం ఆర్టీసీ సిబ్బంది గౌరవవందనం స్వీకరించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలంగా సిద్దించిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించారు.
ప్రయాణికుల భద్రతే మన ప్రథమ కర్తవ్యమనీ, ప్రతి ప్రయాణికుడిని కుటుంబ సభ్యుడిగా భావించి సేవలు అందించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
కార్మికుల సంక్షేమానికి పూర్తి భరోసా ఇచ్చారు. జెండా అనేది కేవలం ఒక వస్త్రం కాదనీ, అది కోట్ల మంది ఆత్మగౌరవ నినాదమన్నారు. లక్షలాది మంది పోరాటాల స్వేచ్ఛా గీతం అని అభిప్రాయపడ్డారు. ప్రగతిని సాధించడంలోనూ దేశంలోనే సాటిలేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సాధించిన అద్భుత ప్రగతిలో తెలంగాణ ఆర్టీసీ కూడా ఒక ముఖ్యమైన భాగస్వామి కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఒకనాడు ఎన్నో సవాళ్లతో ఉన్న మన సంస్థ అని, నేడు ప్రజా రవాణాలో దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది వివరించారు. మన ఉద్యోగుల క్రమశిక్షణ, కష్టం నిబద్ధత మాత్రమేనని అభినందించారు.ముఖ్యంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంస్థ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిందని వివరించారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ ఇప్పటికే విజయవంతంగా 10వేల కోట్ల ఉచిత ప్రయాణాలను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈడీ సిహెచ్.వెంకన్న, ఆర్థిక సలహాదారు విజయ పుష్ప , సిటీఎం శ్రీధర్, సిపిఎం శ్రీమతి ఉషాదేవి, సిటీఎం ట్రాఫిక్ శ్రీదేవి, కవిత , శ్రీమతి ప్రభులత పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -