సకల జనుల పోరాటం తరహాలో మరో ఉద్యమం : టీఆర్ఎల్డీ అధ్యక్షులు దిలీప్‌కుమార్
రాష్ట్ర ఆవిర్బవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళ్లు
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ ప్రజలు ‘సకల జనుల పోరాటం’ తరహాలో మరో ఉద్యమానికి సిద్దం కావాలని రాష్ట్ర రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎల్డీ యువజన అధ్యక్షులు రాజ్‌కుమార్‌రెడ్డి, యాదాద్రిభువ నగిరి జిల్లా అధ్యక్షులు బీరప్ప, ప్రధాన కార్యదర్శి విశాల్, రోషబ్ జైన్, ఓంకార్, గిరి, శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పెద్ద దొంగ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ కంటే ఎక్కువగా మోసం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుని అధికారంలోకి తీసుకువచ్చారని, ఆ ఆశలు వర్షపు నీటిలా మారిపోయాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు ప్రజా సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు కూడా అవినీతిపరులుగా ఆరి ప్రజల సమస్యల పట్ల స్పందించకుండా వ్యవహారిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగడంలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు సకల జనుల పోరాటం తరహాలో మరో ఉద్యమానికి సిద్దం కావాలని, అవినీతిని నిర్మూలించి ‘నిధులు,నీళ్లు, నియామకాలు, అనే తెలంగాణ ఉద్యమ ప్రధాన లక్ష్యాలను సాధించాలని పిలుపు నిచ్చారు. దిలీప్‌కుమార్ నాయకత్వంలో ఆర్ఎల్డీ సభ్యులు..రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేశారు. త్వరలోనే రిటైర్డ్ ఆర్మీ అధికారుల సహకారంతో ‘‘లక్ష్యం కోసం లక్ష సైన్యం’’ పేరుతో యువత నియామక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ యోధులను గుర్తించే కమిటీకి సమైక్యవాది లఅయిన కేశవరావును చైర్మెన్‌గా నియమించడం హాస్యాస్పదమని అన్నారు. ఇది తెలంగాణ వ్యతిరేకులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా చూపిస్తోందని పేర్కొన్నారు.
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



