విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా దర్శకుడు కె.వి.అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈనెల 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా రెండు గంటల పది నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది.
ఫోన్ చూడాలనే ఆలోచనే రాదు. ప్రతి సన్నివేశం చూస్తూ నవ్వుకుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కి రండి. కడుపుబ్బా నవ్వుకుంటారు’ అని తెలిపారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది’ అని దర్శకుడు అనుదీప్ కె.వి.అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌లో పంచ్‌లు బాగా పేలాయి కదా. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. ప్రతి సన్నివేశం మిమ్మల్ని నవ్విస్తుంది. కామెడీ కోసం థియేటర్‌కి రండి. దర్శకుడు అనుదీప్ మిమ్మల్ని అసలు నిరాశపర్చడు. ‘జాతిరత్నాలు’తో ఎలా ఆకట్టుకున్నాడో ఈ సినిమాతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడు’ అని అన్నారు.
నవ్వుతూనే ఉంటారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


