Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన చిన్నకోడూరుతో పాటు అన్ని గ్రామాలలో బుధవారం జన్మదిన వేడుకలను ఘనంగా చేశారు ఈ సందర్భంగా మండల బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెలేటి రాధాకృష్ణ శర్మ, మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, వైస్ ఎంపిపి కిసరి పాపయ్య, నాయకమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చెశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకమ్మ దేవుడి ఆశీస్సులు హరీష్ రావు గారికి ఎల్లప్పుడూ ఉండాలని మండల ప్రజల పక్షాన ఆకాంక్షించారు. హరీష్ రావు ప్రత్యేక సహకారంతోనే మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెశాడని కొనియాడారు. దేవుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో సంతోషంగా సాగాలని కోరుకున్నారు.

ఈ వేడుకల్లో సర్పంచ్ లు వాసుదేవచారి, రాజు, సదానందం, నాయకులు జంగిటి శ్రీనివాస్,రేగుల దేవయ్య, నముండ్ల హరీష్, కుంటయ్య, అబ్బిరెడ్డి,,పీఏసీఎస్  చైర్మన్ అనుపాటి వెంకట్ రెడ్డి,  మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు  బీఆర్‌ఎస్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -