Wednesday, June 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్లాస్టిక్ కవర్ ల వినియోగం తగ్గించాలి

ప్లాస్టిక్ కవర్ ల వినియోగం తగ్గించాలి

- Advertisement -

నవతెలంగాణ-సిర్పూర్(టి )
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సి.హెచ్. బాలమణి పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని దుబ్బగూడ గ్రామంలో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, భూమి సారవంతత దెబ్బతింటుందని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తిని పశువులు, వన్యప్రాణులు అనారోగ్యానికి గురవడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి వనరులను కలుషితం చేయడమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు.

ప్లాస్టిక్‌కు బదులుగా వస్త్ర సంచులు, జూట్ బ్యాగులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓ ఎ. అప్పయ్య, సిర్పూర్ అటవీ క్షేత్ర అధికారి శ్రీనివాస్, డిప్యూటీ అటవీ క్షేత్ర అధికారి ప్రవీణ్ కుమార్, ఎఫ్‌ఎస్‌వో మోహన్‌రావు, అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -