Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీసుల ప్రతిభకు దిక్సూచి 'సురక్ష'

పోలీసుల ప్రతిభకు దిక్సూచి ‘సురక్ష’

- Advertisement -

– డీజీపీ శివధర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

విధి నిర్వహణలో పోలీసుల ప్రతిభను చాటి చెప్పడంలో సురక్ష పత్రిక ముందంజలో ఉందని రాష్ట్ర డీజీపీ, సురక్ష పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. సురక్ష ఆన్‌లైన్‌లో దినపత్రికగా వంద రోజులు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో శివధర్‌రెడ్డి శనివారం మాట్లాడారు. మాస పత్రికగా సురక్ష 30 ఏండ్లకు పైగా నిరంతరంగా వస్తున్నదని ఆయన అన్నారు. విశాలమైన పోలీసు శాఖలో విధులను నిర్వహిస్తున్న అధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు విధి నిర్వహణలో ప్రతిరోజు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపులో వారు చూపిస్తున్న ప్రతిభను గుర్తించి సమాజానికి తెలియజేయడానికి సురక్ష పత్రిక ఒక సాధనంలా పని చేస్తున్నదని డీజీపీ చెప్పారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఈ పత్రిక ద్వారా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులు, సీనియర్‌ పోలీసు అధికారులు చేస్తున్న సూచనలు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు. మాస పత్రికగా వస్తున్న సురక్షను దినపత్రికగా తీసుకొచ్చే యోచన ఉన్నదనీ, అందులో భాగంగానే గత వందరోజులుగా ఆన్‌లైన్‌లో తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. ‘సురక్ష’ ఎడిటర్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ ఎం.రమేశ్‌ మాట్లాడుతూ… ప్రతీ పోలీసు గుండెచప్పుడు సురక్ష పత్రిక వినిపిస్తున్నదనీ, దీనిని మరింతగా జనబాహుల్యంలోకి తీసుకువెళ్లనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పలువురు పోలీసు పీఆర్‌ఓలకు డీజీపీ అవార్డులను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -