Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యలను నిర్వర్తించేందుకే వార్డు సభలు 

సమస్యలను నిర్వర్తించేందుకే వార్డు సభలు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
పురపాలక సంఘం భీంగల్ – ప్రజాపాలన – ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2 వ, 10వ వార్డులలో వార్డ్ సభలను చైర్ పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని కమిషనర్ డీ. గజానంద్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు వివరించారు. రాబోయ్యే వర్షాకాలం వర్షాకాల సన్నద్ధత, ప్రజలు డెంగ్యూ మలేరియా బరిన పడకుండా పరిసరాల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, తడి-పొడి చెత్త సేకరణ గురించి ప్రజలకు అవగాహనా మరియు సూచనలు చేయడం జరిగినది. ఈ వర్షాకాలములో ప్రతి ఒక్కరు మొక్కలు నాటావాలేనని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రములో వివిధ శాఖల అధికారులు వారి యొక్క ప్రగతి ప్రణాళికను చదివి వినిపించారు. కార్యక్రమంలో వైస్ చైర్ చైర్ పర్సన్ శ్రీమతి సంటి లత నర్సయ్య. కౌన్సిలర్ పర్స కుశలత అనంతరావు, వివిధ శాఖల అధికారులు మహిళా సంఘ సభ్యులు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -